మంచి మాటలు!




గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో మాత్రం గెలిచి తీరాలి......
అందం చూసే కళ్లలో ఉండదు, సాయం చేసే చేతుల్లో ఉంటుంది...........
సాధనలేకుండా విజయాన్ని కోరుకోవడం, ఎండమావిలో నీటికై ఆశించడమే......


ప్రవర్తన అద్దం లాంటిది మనిషి వ్యక్తిత్వం అందులో ప్రతిబింబిస్తుంది.....
జీవితంలో వైఫల్యాలూ భాగమేనని తెలుసుకున్నవారు వాటి నుంచి గుణపాఠాల్ని నేర్చుకుంటారు.....
మన కోసం చేసే పని మనతోనే అంతరించిపోతుంది, పరుల కోసం చేసేది శాశ్వతంగా నిలుస్తుంది.....
